ఎక్కడికి వెళ్ళినా సోనూ సూద్ కు ప్రశంసల జల్లు

ఎక్కడికి వెళ్ళినా సోనూ సూద్ కు ప్రశంసల జల్లు

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ స‌మ‌యంలో చాలా మంది పేదలకు సాయం చేసి సినీన‌టుడు సోనూసూద్ అంద‌రితో శ‌భాష్ అనిపించుకున్న‌ విష‌యం తెలిసిందే. అనంతరం కూడా సోనూసూద్‌ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆయనను రియల్ హీరో అని ప్రశంసిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆయనను మెచ్చుకుంటూ సత్కరిస్తున్నారు. తాజాగా, సోనూసూద్‌ను ఆచార్య సినిమా షూటింగ్ సెట్స్‌లో దర్శకుడు శివ కొరటాల, నటుడు తనికెళ్ల భరణి సత్కరించారు. ఆయనకు షాలువా కప్పి, హనుమంతుడి ప్రతిమను అందించారు. కాగా, దేశంలోని పేదలకు, రైతులకు, విద్యార్థులకు సోనూసూద్ సాయం చేస్తున్నారు. తాను సాయం చేసిన వారి వివరాలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. చిరంజీవి హీరోగా రూపుదిద్దుకుంటోన్న ఆచార్య సినిమా షూటింగ్ లాక్‌డౌన్‌ అనంతరం మళ్లీ ప్రారంభమైంది.