దేవదేవునికి తప్పని కరోనా తిప్పలు..(సింహాచలం)

మనందరికి ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు వైశాఖ శుద్ధ తదియ. శ్రీ సింహాచల క్షేత్రంలో వేంచేసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి నిజరూపం అనుగ్రహించే రోజు. ఈ రోజున స్వామి నిజరూపాన్ని దర్శించిన వారి జన్మ ధన్యత చెందుతుంది. కానీ కరోనా కారణంగా భక్తులకు అనుమతి లేదు. అందుకే ఆలయ మాడవీధులు బోసిపోయాయి.

కరోనా రాక్షసుడు విజృంభిస్తున్న తరుణంలో భక్తులను రక్షించుకునేందుకు స్వామి గత నెల రోజులుగా భక్తులను తన ఆలయ దర్శనానికి అనుమతించడం లేదు. అయితే స్వామిని దర్శించుకోవాలి, ఆ వైభవాన్ని చూడాలి అని భావించే వారి కోసం ఈరోజు ఉదయం ఆలయంలో చిత్రీకరించిన వీడియోను అందరికి అందుబాటులోకి తీసుకు వచ్చారు. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి నిజరూప దర్శనము సందర్భంగా నిత్య ఆరాధనలు జరుగుతున్నాయి.