వలస కూలీలు “కూటి కోసం” కన్నీరు…పాట

దేశంలో కరోనా మహామ్మారి కారణంగా అమలవుతోన్న లాక్ డౌన్ నిబంధనలు వలస కూలీల పాలిట శాపంగా మారాయి. కూటి కోసం కొలవలేనంత దూరం కాయ కష్టం చేసుకుని బతికేందుకు వచ్చిన వలస కార్మికులకు కరోనా మహామ్మారి వికృత రూపంతో కాలి నడకన సొంతూరు బాట పెట్టాల్సి వచ్చింది. నలు దిక్కుల లాక్ డౌన్ అమలుతో కార్మికుల పనులకు తాళాలు పడ్డాయి, ప్రయాణానికి నింగి, నీరు,
నేలపై ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకుండా పోయాయి. దీంతో అన్నమో రామచంద్ర అంటూ వలస బతుకులు రోడ్డున బిక్కు బిక్కుమంటూ నాలుగు మెతుకులు తిని కడుపు నింపుకునేందుకు అలమటిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ఆనంద్ విహార్, వాణిజ్య రాజధాని బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో వలస కూలీల పోరాటం మనం చూసాం…
ఆ దారుణ పరిస్థితులకు చెలించి వలస కూలీల కూటి కష్టాలపై గాయని MM శ్రీలేఖ ఓ పాట పాడారు.. మీ కోసం..