షాక్‌లో ఏచూరి కుటుంబం

షాక్‌లో ఏచూరి కుటుంబం


సీపీఏం సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి ఈ ఉదయం కరోనాతో మృతి చెందారు. ఆయన వయసు 34 సంవత్సరాలు. కొవిడ్‌తో రెండు వారాల క్రితం గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన ఆశిష్ అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో అకస్మాత్తుగా మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.కుమారుడి మృతితో ఏచూరి కుటుంబం షాక్‌లోకి వెళ్లిపోయింది. కుమారుడు మృతి చెందిన విషయాన్ని సీతారాం ఏచూరి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా ప్రకటించారు. తన కుమారుడికి చికిత్స అందించిన వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్లు, శానిటేషన్ వర్కర్లకు, ఇతరులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.