స్మార్ట్ ఫోన్లపై కరోనా భూతం? జాగ్రత్తలు..

ప్రస్తుతం అందరూ కరోనా మహమ్మారి కారణంగా ఇంటికే పరిమితమయ్యారు కదా ఎక్కువ సమయం టీవీ ,స్మార్ట్ ఫోన్ లతో సమయం గడిపే వారే కదా అందరూ. అయితే ఆ మహమ్మారి స్మార్ట్ ఫోన్ గ్లాస్ మీద కనీసం నాలుగు రోజులు బ్రతికి ఉండే అవకాశాలున్నాయని అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ జరిపిన అధ్యయనంలో ఈ ఆసక్తి కరమైన విషయం వెలుగు చూపింది. 2003 సంవత్సరంలో వచ్చిన సార్స్ వైరస్ గాజు ఉపరితలంపై నాలుగు రోజులు జీవించి ఉండగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ప్రస్తుతం ప్రజలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్లాస్టిక్,
స్టైన్ లెస్, స్టీల్ ఉపరితలంపై మూడు రోజులు ఉండనుంది.
గాజు ఉపరితలంపై ఎంతకాలం జీవిస్తుందనేది స్పష్టత లేనప్పటికీ గతంలో జరిపిన అధ్యయనం ప్రకారం ఈ వైరస్ నాలుగు రోజులు బ్రతికి ఉండే అవకాశం ఉంది. అంటే మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ స్క్రీన్లపై నాలుగు రోజులు ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ తయారీ గ్లాస్, ప్లాస్టిక్ పదార్థాలతో తయారు చేస్తారు కాబట్టి స్మార్ట్ ఫోన్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని, ఫోన్ వాడిన
తర్వాత చేతులతో నేరుగా ముక్కు,నోటిని,కళ్ళని తాకోద్దని శాస్త్ర వేత్తలు హెచ్చరిస్తున్నారు.