ఖాళీ రైల్వే భూముల్లో సోలార్
ఉపయోగించని ఖాళీ రైల్వే భూముల్లో సౌరశక్తి ప్రాజెక్టులను స్థాపించడానికి భారతీయ రైల్వే (ఐఆర్) ప్రణాళిక వేసింది. ఉపయోగించని ఖాళీ రైల్వే భూముల్లో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్న రాష్ట్రాల వారీ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
i) ఛత్తీస్‌గఢ్- భిలాయ్ వద్ద 50 మెగా వాట్ (ఎండబ్లూ).
ii) ఉత్తరప్రదేశ్ – రాయ్‌బరేలిలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో 3 ఎండబ్లూ.
iii) హర్యానా- దివానా వద్ద 2 ఎండబ్లూ (పానిపట్ వద్ద).
iv) మధ్యప్రదేశ్- బినా వద్ద 1.7 ఎండబ్లూ.
v) మహారాష్ట్ర- 15 ఎండబ్లూ బుట్టిబోరి (నాగ్‌పూర్).
వీటితో పాటు టెక్నో-ఎకనామిక్ సాధ్యాసాధ్యాల ఆధారంగా గుజరాత్‌తో సహా వివిధ రాష్ట్రాలలో ఉపయోగించని భూముల్లో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులను స్థాపించాలని భారతీయ రైల్వే యోచిస్తోంది.
ఈ సమాచారాన్ని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.