కరోనా విస్తరణకు కళ్లెం వేసేలా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి 20 కేంద్ర ప్రజారోగ్య బృందాలను సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కువ కొవిడ్19 పాజిటివ్ కేసులు నమోదవుతున్న 20 జిల్లాలకు ఆ బృందాలను పంపుతున్నారు. ఆ జిల్లాల వివరాలు పరిశీలిస్తే..
1. ముంబయి, మహారాష్ట్ర
2. అహ్మదాబాద్, గుజరాత్
3. దిల్లీ ( ఆగ్నేయం )
4. ఇండోర్, మధ్యప్రదేశ్
5. పుణె, మహారాష్ట్ర
6. జైపూర్, రాజస్థాన్
7. థానే, మహారాష్ట్ర
8. సూరత్, గుజరాత్
9. చెన్నై, తమిళనాడు
10. హైదరాబాద్, తెలంగాణ
11. భోపాల్, మధ్యప్రదేశ్
12. జైపూర్, రాజస్థాన్
13. దిల్లీ (మధ్య)
14. ఆగ్రా, ఉత్తరప్రదేశ్
15. కోల్కతా, పశ్చిమ బెంగాల్
16. కర్నూలు, ఆంధ్రప్రదేశ్
17. వడోదర, గుజరాత్
18. గుంటూరు, ఆంధ్రప్రదేశ్
19. కృష్ణా, ఆంధ్రప్రదేశ్
20. లక్నో, ఉత్తరప్రదేశ్
ఆయా జిల్లాలు/నగరాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో, కొవిడ్ వ్యాప్తిని అరికట్టే నియంత్రణ చర్యల అమల్లో కేంద్ర బృందాలు రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయ, సహకారాలు అందిస్తాయి.