సోనూ సేవలను గుర్తించిన స్పైస్ జెట్

సోనూ సేవలను గుర్తించిన స్పైస్ జెట్

కరోనా వ్యాప్తి నేపథ్యలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించగా… వలసకూలీలు, ఆపన్నుల పాలిట ఆపద్బాంధవుడిలా పరిణమించిన నటుడు సోనూ సూద్ కు అరుదైన గౌరవం దక్కింది. బడ్జెట్ ధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ తన విమానాలపై సోనూ సూద్ బొమ్మను చిత్రించింది. అంతేకాదు, సోనూ సూద్ ను ‘రక్షకుడు’గా అభివర్ణిస్తూ, ఆయనకు శాల్యూట్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో వలసకూలీల వెతలపై తీవ్రంగా స్పందించిన సోనూ సూద్ వారికోసం పెద్ద సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు తరలించారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారి కోసం విమానాలు పంపి స్వదేశానికి రప్పించారు. అడిగిన వారికి కాదనకుండా సాయం చేసి అపర కర్ణుడే అయ్యారు.