కరోనా కట్టడికి శ్రీ చైతన్య విరాళం 4కోట్లు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కట్టడికి తన వంతు సహాయంగా శ్రీ చైతన్య విద్య సంస్థలు 4కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒక్కో కోటి అలాగే తమిళనాడు, కర్ణాటకలకు వేర్వేరుగా 25లక్షలు కేంద్రం ప్రధానమంత్రి నిధికి కోటిన్నర రూపాయలు విరాళంగా అందజేసామని శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత BS రావు తెలిపారు.