భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం

లాక్‌డౌన్ కారణంగా దేవుళ్లు, దేవాలయాలు కూడా మూతపడ్డాయి. దీంతో భద్రాచలంలో శ్రీ రామనవమి నాడు
శ్రీ సీతారాముల కల్యాణం స్వచ్చందంగా నిరాడంబరంగా
బేడా మంటపంలోనే వేడుకలు సాగాయి. శుక్రవారం పట్టాభిషేక మహోత్సవం కూడా భక్త జనం సందోహం కనబడకుండానే ముగిసింది. భక్తులు సామాజిక దూరం పాటించాలని స్వచ్చందంగా ఈ మహోత్సవాలకు హాజరుకాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆలయంలో అర్చకులు మాత్రం రోజూ వారీ పూజలు చేస్తున్నట్టే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.