శ్రీకాకుళం సముద్ర తీరం రెడ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం సముద్ర తీరం అంతటా రెడ్ అలర్ట్ లోకి వెళ్లింది. కారణం తమిళనాడు రాష్ట్రం చెన్నై నుంచి అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న మత్స్యకారులు. ఇంతవరకు 80 మంది మత్స్యకారులు చేరినట్టు అధికారుల అంచనా వేస్తున్నారు. ఇంకా కొంతమంది పడవల్లో సముద్రంలో ఉన్నట్టు ఇళ్లకు సమాచారం అందిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. మత్స్యకారులను గుర్తించి క్వారంటైనుకు పంపిస్తున్నామని అధికారులు తెలిపారు.