స్వీయ నిర్బంధంలో శ్రీరామ నవమి వేడుకలు

స్వీయ నిర్బంధమే మనకు శ్రీరామరక్ష
అలయాల్లో మాత్రమే శ్రీరామ నవమి వేడుకలు
అర్చకుల సమక్షంలోనే సీతారాముల కల్యాణం
ఇంట్లోనే ఉందాం లోక రక్షణకు ప్రార్థిద్దాం .

స్వీయ నిర్బంధమే శ్రీరామరక్షా అని శ్రీరామ నవమి సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు గారు పిలుపునిచ్చారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీరాముడు కష్టాల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించారు అని.. శ్రీరామున్ని ఆదర్శంగా తీసుకొని విశ్వాన్ని వినాశనం చేసేలా దాపురించిన మహమ్మారి కరోనాని మనో ధైర్యం తో తరిమికొడదామని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని , ఆరుబయట కాకుండా ఆలయాల్లో కేవలం అర్చకుల సమక్షంలోనే శ్రీ సీతారామ కల్యాణం చేయాలన్నారు.. ఆలయాల్లో అర్చకులు చేసేది లోక కళ్యాణము.. ప్రజలంత ఇంట్లోనే ఉండి లోక రక్షణ కొరకు శ్రీరామున్ని ప్రార్ధిదిద్దాం అని చెప్పారు. శ్రీరాముని అనుగ్రహము ప్రజలందరి పై ఉండాలని.అంత శుభం కలగాలని ప్రభుత్వం చెప్పే సూచనలు పాటిస్తూ కరోనా మహమ్మారి ని పారదోలుదామని భగవంతున్ని వేడుకున్నారు. తండ్రి అదేశంతో రాముడు
14 ఏళ్ల పాటు వనవాసం చేసి అద్భుతమైన రామరాజ్యాన్ని స్థాపించారని గుర్తుచేశారు. ఆయన స్పూర్తితో ఈ 14 రోజుల పాటు ఇళ్లలోనే ఉంటూ ఆరోగ్యమైన దేశంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు.