మోడీ సంకల్పానికి శ్రీశైల జగద్గురువుల ఆశీస్సులు

చీకటి రోగము యొక్క సంకేతము, దీపం ఆరోగ్యం యొక్క సంకేతము, చీకటి దారిద్యం యొక్క సంకేతము, దీపం ఉత్సాహం యొక్క సంకేతము, చీకటి ఒంటరితనం యెక్క సంకేతము, దీపం ఒక ఉమ్మడి వెలుగు యొక్క సంకేతము, అందువలన మన దేశ ప్రధాని మాన్య శ్రీ నరేంద్రమోడీ గారు ఏప్రిల్ 5న రాత్రి 9:00 గం లకు 9 నిమిషాల పాటు మీ మీ ఇంటి ముందు మీ మీ బాల్కనీ , వరండా లలో కి వచ్చి సామాజిక దూరాన్ని పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత తో నూనెతో ప్రమిద దీపం కానీ, కొవ్వొత్తి దీపం కానీ, టార్చ్ లైట్ కానీ, సెల్ ఫోన్ లైట్ కానీ, ఇలా మీకు అందుబాటులో వుండే ఏ దీపాన్ని అయినా సరే వాడి *9 నిమిషాల పాటు* వెలిగించాలని సంకల్పించారు.

ఈ 9 నిమిషాలు ఎందుకంటే సంఖ్యా శాస్త్రము, వాస్తు శాస్త్రములలో ఈ 9 కీ ప్రత్యేక శక్తివంతమైన స్థానం ఉన్నది, ఇది నిండు సంఖ్య పరిపూర్ణతకు సంకేతం అందువలన ప్రధానమంత్రి గారి సంకల్పానికి దేశ ప్రజలందరూ కూడా ఎలాంటి భేషజాలు లేకుండా భారత్ మాతాకీ జై అంటూ ఓకే సంకల్పంతో జాగ్రత్తగా దీప ప్రజ్వలనను 9 నిమిషాల పాటు దేదీప్యమానంగా వెలిగించి *ఆ తధాస్తు దేవతలు మన సంకల్పాన్ని నెరవేర్చేలా* దేశమంతా పెద్ద దీపావళి పండుగల వీరాజిల్లాలి, ఇదంతా కూడా భారత దేశాన్ని కబలిస్తున్న *కరోణ వైరస్ ను సమూలంగా తరిమి కొట్టుటకు* దేశ ప్రజలందరూ కలిసి దృఢనిశ్చయంతో సత్సంకల్పంతో ఏకతాటిగా కృషి చేయాలని ఈ సందర్భంగా దేశ ప్రజలని కోరుతున్నాము. ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ