*శ్రీశైల దేవస్థానములో భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్లకు భక్తులు ఆర్జితసేవలను నిర్వహించుకునేందుకుగాను-‘శ్రీశైల పరోక్షసేవ’ ప్రారంభం.
• శ్రీశైలానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు ఆన్‌లైన్‌ద్వారా సేవారుసుము చెల్లించి ఆర్జితసేవలను పరోక్షంగా జరిపించుకునే సదుపాయం
• పరోక్షసేవలలో గణపతిహోమం, రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయహోమం, సుబ్రహ్మణ్యేశ్వరకల్యాణం, శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లకల్యాణాన్ని నిర్వహించుకునే అవకాశం.
• పరోక్ష ఆర్జితసేవలలో ఒక్కొక్క పూజకు సేవారుసుము రూ. 1,116/-లు. QR కోడ్‌ను ఉపయోగించి గూగుల్‌పే, ఫోన్‌పే, BHIM, Paytm ద్వారా సేవా రుసుమును చెల్లించే సదుపాయం.
• సేవాకర్తలు వారి పేరున జరిగే సేవను వీక్షించేందుకు వీలుగా యూ ట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్న దేవస్థానం.
• దేవస్థానం కాల్‌సెంటర్ ద్వారా ( 83339 01351 / 52 / 53 / 54 / 55/ 56) వివరాలను పొందే సదుపాయాన్ని కల్పించిన దేవస్థానం.
• ఆన్లైన్ ద్వారా సేవారుసుము చెల్లించి మొదటి పరోక్షసేవగా గణపతిహోమాన్ని జరిపించుకున్న శ్రీశైల నియోజకవర్గ శాసనసభ్యులు