భార్యతో కలిసి గోపాలపురంలోని తల్లి ఇంటికి వెళ్లిన స్టాలిన్

భార్యతో కలిసి గోపాలపురంలోని తల్లి ఇంటికి వెళ్లిన స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తల్లి నుంచి ఆశీర్వాదం అందుకున్నారు. నిన్న ఉదయం తన తల్లి దయాలు అమ్మాళ్ నివసిస్తున్న గోపాలపురంలోని ఇంటికి వెళ్లిన స్టాలిన్‌ దంపతులకు సోదరి సెల్వి హారతులు ఇచ్చి టెంకాయ కొట్టి లోనికి ఆహ్వానించారు.అనంతరం తల్లికి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అన్నా అరివాలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన నిల్చుని కనిపించిన తన బాల్యమిత్రుడు రామచంద్రన్‌ను చూసి కారు దిగి పలకరించారు. అతడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.