కరోనా వైరస్ రక్షణ పాలసీ ఇస్తామంటున్న స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్.

కరోనా వైరస్ రక్షణ పాలసీ ఇస్తామంటున్న స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్.

– సుప్రసిద్ధ ఆరోగ్య బీమా సంస్ధ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ‘స్టార్ నోవెల్ కరోనా వైరస్ ఇన్సూరెన్స్ పాలసీ’ని ఆవిష్కరించింది. కోవిడ్-19 మహమ్మారి (నోవెల్ కరోనా వైరస్) రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో స్టార్ హెల్త్ సరికొత్త పాలసీని ప్రవేశ పెట్టింది. హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్న రోగులకు ఈ హెల్త్ పాలసీ ఎంతో ప్రయోజనం కలిగించనున్నది. స్టార్ నోవెల్ కరోనా వైరస్ పాలసీకి 18 నుంచి 65 ఏండ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులు. ఏకమొత్తంలో చెల్లింపుల ప్రయోజనాన్ని బీమా చేయించుకున్న వ్యక్తులకు అందించనుంది.

మొదటి స్కీమ్ ప్రీమియం రూ. 21వేలు:
– ప్రభుత్వం నిర్ధారించిన పరీక్షా కేంద్రం వద్ద కరోనా వైరస్ పాజిటివ్‌గా వస్తే, ఆ వైరస్ చికిత్స కోసం హాస్పిటల్లో చేరిన వారికి ఈ మొత్తాలను అందిస్తారు. మరీ ముఖ్యంగా ఈ పాలసీలో ఎలాంటి అంతర్జాతీయ పర్యటనల సంబంధిత మినహాయింపులు లేవు. ఈ ‘స్టార్ నోవెల్ కరోనా వైరస్ పాలసీ’ రెండు పాలసీలను అందిస్తుంది. మొదటి స్కీమ్ ప్రీమియం రూ. 21వేలు కాగా, 459 రూపాయలు జీఎస్టీ అదనం. రెండో స్కీమ్ ప్రీమియం 42 వేల రూపాయలు. దీనికి రూ. 918 జీఎస్టీ అదనం. 65 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఎవరైనా సరే ఈ పాలసీని స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ వెబ్ సైట్ లేదా విస్తృత శ్రేణిలోని కంపెనీ నెట్వర్క్ ఏజెంట్లను సంప్రదించవచ్చు.

వైద్య ప‌రీక్ష‌లు లేకుండానే హెల్త్ పాల‌సీ:
-ఎటువంటి ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించకుండానే ఈ హెల్త్ పాలసీ కొనుగోలు చేయవచ్చు. “ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు కరోనా వైరస్ కోవిడ్-19ను మహమ్మారిగా ప్రకటించింది. ఈ వైరస్ బారిన పడకుండా భారతీయులు తమను తాము కాపాడుకోవాల్సి ఉంది. ఈ వైరస్ బారిన పడిన వారికి ఉపయోగపడేలా ఈ పాలసీ డిజైన్ చేశామని స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ అఫిషియ‌ల్స్ చెబుతున్నారు. దేశంలో ఉండేవారికి కాడకుండా, ఇతర దేశాల్లో ఉన్న వారికి సైతం ఈ పథకం వర్తిస్తుందని అంటున్నారు. క‌రోనా వైరస్ బారిన పడిన వారికి హాస్పిటలైజేషన్ ఖర్చులకు తగినట్లుగా ఇది తోడ్పడుతుంద‌ని చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.