ఉదయం లాభాలతో ఆరంభమైనా మధ్యాహ్నానికి నష్టాలు

ఉదయం లాభాలతో ఆరంభమైనా మధ్యాహ్నానికి నష్టాలు

భారత స్టాక్ మార్కెట్లో ఇవాళ అత్యధికభాగం అనిశ్చితి రాజ్యమేలింది. అమెరికా స్టాక్ ఎక్చేంజి పరిణామాలతో సెన్సెక్స్ భారీ లాభాలతో ఆశాజనకంగా ప్రారంభమైనా, మధ్యాహ్నం తర్వాత ట్రెండ్ మారింది. సెన్సెక్స్ తో పాటు నిఫ్టీ సైతం పతనం దిశగా పయనించింది. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు డౌన్ ట్రెండ్ లో పయనం సాగించాయి. ఈ ఒరవడి ఇలాగే కొనసాగి ఉంటే మార్కెట్లకు నష్టం వాటిల్లేది. అయితే చివరి గంటలో కొనుగోళ్ల అండతో మార్కెట్ సూచీలు పుంజుకున్నాయి.సెన్సెక్స్ 162.94 పాయింట్ల వృద్ధితో 40,707.31 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 40.90 పాయింట్ల పెంపుతో 11,937 వద్ద స్థిరపడింది. ప్రారంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభాలు రాబట్టింది. అదే సమయంలో నిఫ్టీ సైతం 12 వేల మార్కును అధిగమించింది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారిపోవడంతో భారీ లాభాల ఆశలు ఆవిరయ్యాయి. చివరికి ఓ మోస్తరు లాభాలతో మార్కెట్లు గట్టెక్కాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ విభాగాలు నష్టాల పాలవగా, రియాల్టీ, టెలికాం, మెటల్ షేర్లు లాభాల బాటలో నడిచాయి.