స్టేట్ కొవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ నియామకం

స్టేట్ కొవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం స్టేట్ కొవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. ఇదే సమయంలో ఆయన స్థానంలో ప్రస్తుతం అదనపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న ధర్మారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఈ ఉదయం ఓ జీవోలో పేర్కొంది.

కేఎస్ జవహర్ రెడ్డి అధికారిక కార్యాలయాన్ని ప్రస్తుతానికి తిరుపతి నుంచి వెలగపూడి సచివాలయానికి మారుస్తున్నామని పేర్కొంది. కాగా, కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాత జవహర్ రెడ్డి, తిరిగి తిరుమల ఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.