దేశంలోని అన్ని రాష్ట్రాల్లో Red, Green జోన్ల ప్రకటన: కేంద్రం

ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల వివరాలు పరిశీలిస్తే రెడ్‌జోన్‌ జిల్లాలుగా కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలుగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ, గ్రీన్‌జోన్ జిల్లాల్లో విజయనగరం జిల్లాను ప్రకటించారు. కరోనాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ఖచ్చితంగా వేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని, తరుచు చేతులు కడుక్కోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

దేశంలోని అన్ని రాష్ట్రాల జోన్ల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మీకు అధికారిక ఉత్తర్వుల ఫైల్ అందుబాటులోకి వస్తుంది.

తెలంగాణలో కరోనా ప్రభావిత జిల్లాల జోన్ల జాబితా కేంద్రం ప్రకటించింది. రెడ్‌జోన్లుగా హైదరాబాద్‌, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ అర్బన్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలు, ఆరెంజ్‌ జోన్లుగా గద్వాల, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసీఫాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, జగిత్యాల, జనగాం, మెదక్, సిరిసిల్ల, భూపాలపల్లి, నారాయణపేట, మంచిర్యాల
గ్రీన్‌ జోన్లులుగా ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్ , భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, సిద్దిపేట, భువనగిరి యాదాద్రి, వరంగల్ రూరల్