ఇండియా కోవిడ్-19పై రౌండప్ (21.04.2020)

ముంద‌స్తు చ‌ర్య‌లు, సానుకూల విధానాలు, గ్రేడెడ్ రెస్పాన్స్ పాల‌సీలో భాగంగా రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ సమిష్టి కృషి ద్వారా కోవిడ్ -19 నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా ఉన్న‌త‌ స్థాయిలో సమీక్షిస్తున్నారు.

కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధన్ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు చెందిన ఆరొగ్య విభాగాల‌కుఒక లేఖ రాస్తూ ర‌క్త‌నిధి కేంద్రాల‌లో త‌గినంత ర‌క్త నిల్వ‌లు అందుబాటులో ఉండేట్టు చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిందిగా కోరారు. ప్ర‌త్యేకించి త‌ల‌సేమియా, సికిల్‌సెల్ అనీమియా, హెమోఫోలిస్ వంటి ర‌క్త సంబంధ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి రెగ్యుల‌ర్‌గా ర‌‌క్త‌మార్పిడి అవ‌స‌రం ఉంటుందని అలాంటి వారికి ర‌క్తం అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ప్ర‌తి రక్త‌నిధి కేంద్రంలో ప్ర‌తి గ్రూపు ర‌క్త నిల్వ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునేందుకు ఈ ర‌క్త్ ఖోష్ ఆన్‌లైన్ పోర్ట‌ల్‌ను వాడాల‌న్నారు. కోవిడ్ -19 నియంత్ర‌ణ‌కు స‌మ‌ష్ఠి కృషిలో భాగంగా ఇండియ‌న్ రెడ్‌క్రాస్ సంస్థ ర‌క్త‌స‌ర‌ఫ‌రా సేవ‌ల కోసం ఢిల్లీలో 24 గంట‌లూ ప‌నిచేసే కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించింది. నెంబ‌ర్లు : 011-23359379, 93199 82104, 93199 82105.

మాన‌వ వ‌న‌రులు, సామ‌ర్ధ్యాల పెంపు బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌బ‌డిన సాధికార క‌మిటీ -4 కోవిడ్ వారియ‌ర్స్ పేరుతో ఒక డాష్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ డాష్ బోర్డు లో 20 కేట‌గిరీల (49 స‌బ్ కేట‌గిరీలు)కు సంబంధించిన మాన‌వ వ‌న‌రుల స‌మాచారం ఉంది. .ఇందులో ఎం.బిబిఎస్ డాక్ట‌ర్లు, ఆయుష్ డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఆశా, అంగ‌న్‌వాడి వ‌ర్క‌ర్లు, పిఎంకెవివై, డిడియు జికెవై, డిఎవై – ఎన్‌యుఎల్ఎం, వంటి వివిధ ప‌థ‌కాల కింద శిక్ష‌ణ పొందిన ఆరోగ్య కార్య‌కర్త‌లు, ఎన్‌సిసి, ఎన్‌వైకెఎస్‌, ఎన్ఎస్ ఎస్‌, మాజీ సైనికోద్యోగుల వంటి ఆరోగ్య వలంటీర్ల స‌మాచారం పొందుప‌రిచారు.

ప్ర‌స్తుతం 1.24 కోట్ల మాన‌వ వ‌న‌రులకు సంబంధించిన స‌మాచారం డాష్ బోర్డులో ఉంది. దీనిని ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. కొత్త గ్రూపులు, ఉప గ్రూలు వారి స్పెష‌లైజేష‌న్‌తోపాటు స‌మాచారాన్ని అప్‌డేట్ చేస్తున్నారు. ఆ డాష్ బోర్డులో రాష్ట్ర‌, జిల్లా వారీగా స‌మాచారం పొందుప‌రిచారు. ప్ర‌తి గ్రూప్‌న‌కు సంబంధించి అందుబాటులో ఉన్న‌ మాన‌వ‌వ‌న‌రులు, సంబంధిత రాష్ట్ర‌, జిల్లా నోడ‌ల్ అధికారులను సంప్ర‌దించ‌డానికి వివ‌రాలు పొందుప‌రిచారు.
ఈ ప్లాట్ ఫాం లో ఎప్పుడైనా ఎక్క‌డైనా అందుబాటులో ఉండే శిక్ష‌ణ మెటీరియ‌ల్‌, మాడ్యూల్స్ ఉంచారు. అలాగే వీటిని ఏ ఉప‌క‌ర‌ణం ద్వారానైనా( మొబైల్‌, ల్యాప్‌టాప్‌,డెస్క్‌టాప్‌) చూడ‌డానికి వీలు క‌లుగుతుంది. ఈ ప్లాట్‌ఫాంలో 14 కోర్సులు,53 మాడ్యూళ్లు 113 వీడియోలు 29 డాక్యుమెంట్లు ఉన్నాయి.

ఈరోజు వ‌ర‌కు , 14995 ఆయుష్ ప్రొఫెష‌న‌ల్స్‌ను 15 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల‌లో నియ‌మించారు. అలాగే 3492 మంది ఎన్‌సిసి కేడెట్లు, 553 మంది సిబ్బందిని 16 రాష్ట్రాలు, 3 కేంద్ర ‌పాలిత ప్రాంతాలలో గ‌ల 68 జిల్లాల‌లో నియ‌మించారు. 47,000 కాడెట్లు ఙ‌క్ష‌ణ‌కు త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్నారు. వీరు త‌మ సేవ‌లు అందించ‌డానికి సిద్ధంగా ఉంటారు. సైనిక్ బోర్డుల ద్వారా 1,80,000 మంది మాజీ సైనికులను త‌గిన సేవ‌ల కోసం గుర్తించారు. ఇండియ‌న్ రెడ్ క్రాస్ నుంచి 40,000 మంది వాలంటీర్లు దేశంలోని 550 కిపైగా జిల్లాల‌లో కోవిడ్ -19 సంబంధిత కార్య‌క‌లాపాల‌లో చురుకుగా పాల్గొంటున్నారు. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల‌కు సంబంధించి 27 ల‌క్ష‌ల మంది‌ ఎన్‌వైకెఎస్, ఎన్‌.ఎస్‌.ఎస్ వలంటీర్లు , పౌర యంత్రాంగంతో క‌లిసి కోవిడ్ -19 కార్య‌క‌లాపాల‌లో పాల్గొంటున్నారు.

కొంద‌రు ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల‌కు పాజిటివ్ రావ‌డంతో ఆస్ప‌త్రుల‌ను మూసివేయ‌డం, నాన్ కోవిడ్ ఆస్ప‌త్రుల‌లో సంబంధం లేని వ్యాధుల‌తో చేరిన కొంద‌రికి పాజిటివ్ రావ‌డంతో ,నాన్ కోవిడ్ ఆస్ప‌త్రుల‌లో ఇలాంటి కేసుల‌ను గుర్తించేందుకు అనుస‌రించాల్సిన విధానాల‌పై ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీచేసింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాలు కింద లింక్ లో చూడ‌వ‌చ్చు.
https://www.mohfw.gov.in/pdf/GuidelinestobefollowedondetectionofsuspectorconfirmedCOVID19case.pdf

ఆస్ప‌త్రుల‌లో ఇలాంటి అంశాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించాల్సిన బాధ్య‌త ఇన్‌ఫెక్ష‌న్ కంట్రోల్ క‌మిటీపై ఉంచారు. ఈ క‌మిటీ , ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌లు ఇన్‌ఫెక్ష‌న్‌ను నియంత్రించేందుకు ,నిరోధానికి అనుస‌రించాల్సిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించేలా చూడాలి. ఇందుకు సంబంధించిన కొన్నిమార్గ‌ద‌ర్శ‌కాలు కింది విధంగా ఉన్నాయి.
– కేసు గురించి స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయ‌డం , కోవిడ్ -19 చికిత్స‌కోసం రోగిని ఐసొలేష‌న్‌కు బ‌దిలీ చేయ‌డం.
అలాంటి రోగులకు మాస్క్ వేయాలి . తగిన జాగ్రత్తలు అనుసరిస్తూ ఈ ప‌నిలో నిమ‌గ్న‌మైన ఆరోగ్య కార్యకర్త తగిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ ఈ కేసుకు హాజరు కావాలి
పేషెంట్ స్థితిని బ‌ట్టి ,పేషెంట్‌ను త‌గిన ప్ర‌మాణీకృత ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌ల‌తో కోవిడ్ ప్ర‌త్యేక ఆస్ప‌త్రికి త‌ర‌లించాలి. ఆ కేంద్రాన్ని క్రిమిర‌హితం చేయాలి.
పేషెంట్‌తో కాంటాక్ట్‌లోకి వ‌చ్చిన అందరినీ క్వారంటైన్‌కు పంపాలి, ఆ త‌దుప‌రి రోజుల‌లో వారి ఆరోగ్య ప‌రిస్థితి గ‌మ‌నిస్తూ ఉండాలి.

పేషెంట్‌తో స‌న్నిహిత కాంటాక్ట్ క‌లిగిన వారంద‌రినీ ఏడు వారాల‌పాటు హోం క్వారంటైన్లో ఉంచాలి. తీవ్రంగా జ‌బ్బు ప‌డిన కోవిడ్ -19 పేషెంట్ల‌లో మ‌ర‌ణాలను త‌గ్గించ‌డానికి , వారికి వాడే ఔష‌ధాల స‌మ‌ర్థ‌త‌ను అంచ‌నావేసేందుకు రాండ‌మైజ్‌డ్‌, బ్లైండెడ్‌, టూ ఆర్మ్స్‌,యాక్టివ్ కంపార‌ట‌ర్ – కంట్రోల్డ్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్‌ను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ,ఇండ‌స్ట్రియ‌ల్ రీసెర్చ్‌(సిఎస్‌.ఐ.ఆర్‌) ప్రారంభిస్తున్న‌ది.

కోవిడ్ -19, గ్రామ్-నెగటివ్ సెప్సిస్‌తో బాధపడుతున్న రోగుల క్లినికల్ లక్షణాల మధ్య సారూప్యతలను బట్టి, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఈ ట్ర‌య‌ల్‌ను ఆమోదించింది. ఇది త్వరలో బహుళ ఆసుపత్రులలో అందుబాటులోకి రానుంది.

ఆరోగ్య సంరోణ రంగ సవాళ్లను ఎదుర్కోవటానికి మెడికల్ ఎక్విప్‌మెంట్ డయాగ్నోస్టిక్స్, థెరాపిటిక్స్, డ్రగ్స్ ,వ్యాక్సిన్ అభివృద్ధికి తోడ్పడటానికి బయోటెక్నాలజీ విభాగం కోవిడ్ -19 కన్సార్టియంలో దరఖాస్తులను ఆహ్వానించింది. కింది వాటి కోసం బహుముఖ విధానం అనుసరిస్తున్నారు.
వివిధ ప్లాట్‌ఫారమ్‌లను , అభివృద్ధి వివిధ దశలను ఉపయోగిస్తున్న వ్యాక్సిన్ కాండిడేట్ల‌ను నేషనల్ బయోఫార్మా మిషన్ వేగంగా ట్రాక్ చేస్తున్న‌ది. ప్ర‌స్తుత వాక్సిన్ కాండిడేట్లు, నోవెల్ వాక్సిన్ కాండిడేట్ల‌కు సంబంధించి రీ ప‌ర్ప‌స్ కోసం నిధుల మ‌ద్ద‌తుకు సిఫార్సు చేయ‌డం జ‌రిగింది.

కోవిడ్ -19 కు వ్య‌తిరేకంగా డిఎన్ఎ వాక్సిన్ అభివృద్ధికి, ఇనాక్టివేటెడ్ రేబి వెక్ట‌ర్ ఉప‌యోగిస్తున్న వాక్సిన్ కాండిడేట్ల‌కు, ఫేస్ -3 రికాంబినెంట్ బిసిజి వాక్సి కు సంబంధించి క్లినిక‌ల్ ట్ర‌యల్స్‌కు మ‌‌ద్ద‌తు ఇవ్వ‌డం జ‌రుగుతుంది. దేశీయంగా మాలిక్యులార్, రాపిడ్ డ‌యాగ్నోస్టిక్ కిట్స్ ఉత్ప‌త్తికి కూడా మ‌ద్ద‌తు ఇవ్వ‌డం జ‌రుగుతుంది.

నాలుగు జిల్లాలైన‌- మహే (పుదుచ్చేరి), కొడగు (కర్ణాటక), పౌరి గర్హ్వాల్ (ఉత్తరాఖండ్) & ప్రతాప్‌గ‌ఢ్ (రాజస్థాన్) ల‌లో గత 28 రోజుల్లో తాజాకోవిడ్ కేసులు నమోదు కాలేదు. గ‌త 14 రోజుల‌లో ఎలాంటి తాజా కేసు న‌మోదు కాని జిల్లాలలో, 23 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల నుంచి 61 కొత్త అద‌న‌పు జిల్లాలు ఉన్నాయి. ఈ జాబితాలో మ‌హారాష్ట్ర‌నుంచి నాలుగు కొత్త జిల్లాలు చేరాయి. అవి లాతూరు, ఉస్మానాబాద్ హింగోలి, వాషిమ్‌.

దేశ‌వ్యాప్తంగా 18,601 కోవిడ్ -19 కేసులు న‌మోద‌య్యాయి. 3252 మంది అంటే మొత్తం కేసుల‌లో 17.48 శాతం కేసులు కోలుకున్న అనంత‌రం డిశ్చార్జి అయ్యాయి. కోవిడ్ -19 కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కూ 590 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.

కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత స‌మాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు, ఇత‌ర సూచ‌న‌ల కోసం క్ర‌మం త‌ప్ప‌కుండా గ‌మ‌నించండి : https://www.mohfw.gov.in/.

కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాల‌పై త‌మ ప్ర‌శ్న‌ల‌ను [email protected] ఈమెయిల్‌కు పంపవ‌చ్చు. ఇత‌ర ప్ర‌శ్న‌ల‌ను [email protected] .కు పంప‌వచ్చు.

కోవిడ్ -19పై ఏవైనా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల కోసం కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ హెల్ప్‌లైన్ నెంబ‌ర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయ‌వ‌చ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .