కరోనాలో కన్నతండ్రి కన్నీళ్లు..

ఏ తండ్రికి రాకూడని కష్టం. కలలో కూడా ఊహించని సంఘటన ఓ తండ్రికి కరోనా కాలంలో ఎదురైంది. ఆ క్షణం ఎంత బాధాకరమైనది. ఈ సంఘటనను చూసైనా తెలంగాణలో ప్రజలెవ్వరు బయటకు వెళ్లకూడదని కోరుకుంటున్నానని MP సంతోష్ విజ్ఞప్తి చేసారు.

ఓ పిల్లవాడు చేసిన తప్పు ఏమిటో తెలియదు. కరోనా మహామ్మారి కారణంగా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. కరోనా మహామ్మారిని నివారించడానికి ఏకైక మార్గం మనమందరం విడివిడిగా ఐక్యమత్యంతో #StayAtHome ని ఖచ్చితంగా అమలు చేయడమే. దయచేసి ప్రజలందరూ ఇళ్లకు పరిమితం అవ్వాలని MP సంతోష్ వేడుకున్నారు.