APలో తుపాను అప్రమత్తత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “ఎంఫాన్‌” తుపాను విజృంభిస్తే సహాయక చర్యలకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి YS జగన్ ఆదేశాలు జారీ చేసారు. ఎప్పటికప్పుడు తుపాను కదలికల్ని గమనించాలి, విద్యుత్తు, రెవిన్యూ, పౌరసరఫరాలు, వైద్యశాఖ సన్నద్ధంగా ఉండాలి. ఆస్తినష్టం, ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలి. వేట నిషేధ సమయములో బోట్లలో ఏ ఒక్కరూ సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలి. కొంతమంది అధికారులను సిద్ధంచేసుకోవాలి.తుఫాను కార్యాచరణ కూడా సిద్ధంచేసుకోవాలి. తుపానును దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, ధాన్యం సేకరణలో అగ్రెసివ్‌గా ఉండాలని, కల్లాల్లో ఉన్న ధాన్యం వీలైనంతవరకూ కొనుగోలు చేయాలని, వర్షాల వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉన్న పంటల సేకరణలో వేగం పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి పంటలో మూడింట ఒక వంతు పంటను మార్కెట్లో జోక్యం కింద కొనుగోలు చేయడానికి అధికారులు సిద్ధం కావాలన్న సీఎం వీటికి మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుంటే ధరల్లో స్థిరీకరణ వస్తుందన్నారు.

వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు రావాలంటే.. పండే పంటలో మూడింట ఒక వంతు కొనుగోలు చేయాలి. వాటిని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి, మార్కెట్‌ను ఏర్పాటుచేసుకుని పంపాలి. ఈ విధానాన్ని వ్యవస్థీకృతం చేసుకుంటేనే ధరల స్థిరీకరణ జరుగుతుందన్నారు. పెరిషబుల్‌ గూడ్స్‌ను గతంలో ప్రభుత్వం ఎప్పుడూ కూడా సేకరించలేదని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అది జరిగిందని, గతంలో ఎన్నడూలేని విధంగా కూడా కొనుగోలు చేశామన్న అధికారులు ఈ కొనుగోలును పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.