తాట తీసేందుకు TS పోలీసులు సమీక్ష

తెలంగాణలో లాక్ డౌన్ మే7వ తేదీ వరకు పొడిగింపుపై DGP మహేందర్ రెడ్డి పోలీసు విభాగ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ అమలు కఠినంగా నిర్వహించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

లాక్ డౌన్ రోజులు పెరుగుతున్న నేపథ్యంలో రోడ్ల పైకి వచ్చే వాహనాల సంఖ్య పెరిగింది. రేపటి నుంచి లాక్ డౌన్ అమలు పై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాము. నిత్యావసర సరుకులు, ఐటీలో ఉద్యోగులకు కొన్ని పాసులు ఇచ్చాము వాటిని మళ్ళీ రివ్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. అత్యవసర పరిస్థితుల కోసం పాస్ ఇచ్చాము కానీ కొన్ని పాసులు మిస్ యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పాసును టైమింగ్ ప్రకారం కొత్త పాస్ లను ఇస్తాము, ఇచ్చిన రూట్లో కాకుండా వేరే రూట్ లో వెళ్తే పాస్ రద్దు చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా పాస్ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది- కొత్త పాసులు ఇచ్చే వరకు పాత పాసులు ఇస్తాము. రోడ్ల పైకి వచ్చే వాహనాల్లో ప్రభుత్వ ఉద్యోగుల వాహనాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు రోజు వారిగా కలర్ కోడ్ తో పాస్ లను ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం రూట్ మ్యాప్ ప్రకారం పాసులను ఇస్తాము. రోజూ నిత్యవసర సరుకుల వాహనాలు 3 కిలో మీటర్ల లోపే సరుకులు కొనుక్కోవాలి. సరుకులు కొనే ప్రతి ఒక్కరు ఇంటి అడ్రస్ వెంట పెట్టుకోవాలి లేదంటే చర్యలు ఉంటాయి.

హాస్పిటల్ కి వెళ్లే వాళ్ల కూడా ఇంటి చిరునామాతో వెళ్ళాలి. సాధారణ చికిత్స కోసం అయితే దగ్గరలో హాస్పిటల్ కి మాత్రమే వెళ్ళాలి. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి కరోనా వ్యాధి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటి వరకు 1లక్ష 21వేల వాహనాలను సీజ్ చేసాము. కరోనా లాక్ డౌన్ పూర్తి అయ్యాకే వాహనాలను కోర్టు ద్వారా మళ్ళీ తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి-అధికారులకు ప్రజలందరూ సహకరించాలి. మే 7వ తేదీ తరువాత లాక్ డౌన్ కొనసాగే అవకాశం లేకుండా ప్రజలు సహకరించాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి…ఇతరులకు వైరస్ సోకకుండా జాగ్రత్తగా ఉండాలి.

ఫుడ్ డిస్టిబ్యూషన్ చేసే సమయంలో సోషల్ డిస్టెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ సమస్యలు తలెత్తే విధానం సూపర్ మార్కెట్లు వ్యవహరిస్తే సీజ్ చేస్తాం. పోలీసులకు-ప్రభుత్వానికి కాలనీ రెసిడెన్ష వెల్ఫేర్ అసోషియేషన్ సహకరించాలి. రెసిడెన్షి అసోషియేషన్లలో ఒకే ఎంట్రీ-ఏక్సిట్ ఉండేలా చూసుకోవాలి. కరోనా కేసుల్లో పోలీస్ సిబ్బంది క్లోజ్ గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని బార్డర్స్ మూసివేశాము@గూడ్స్ వెహికిల్స్ మాత్రమే అనుమతి ఇస్తున్నాము. కంటైన్మెంట్ ఏరియాల్లో కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. రోజువారీ టెస్టుల్లో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు 15వేల ఎస్సెన్షషియల్ పాసులు ఇచ్చాము. కొన్ని కంపెనీలకు వారి కంపెనీ ముద్రతో ఎలాంటి పాసులు ఇవ్వలేదు. హైదరాబాద్ నుంచి ఐదుగురు నల్గొండ నుంచి 4మంది వెళ్లారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారు మొత్తం ట్రేస్ చేసాము అందరికి టెస్టులు చేసాము.