హాస్టళ్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు

హాస్టళ్ల ఖాళీపై విద్యార్థులు ఆందోళన

హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ ప్రభావంతో హాస్టల్ యజమానులు విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. ముఖ్యంగా అమీర్ పేట, పంజాగుట్ట, మాదాపూర్, బాలనగర్ ఏరియాల్లో హాస్టల్స్ నుంచి విద్యార్థులను పంపిచేస్తున్నారు. దీంతో మేము ఎక్కడికి వెళ్లాలని విద్యార్థులు ఆందోకన చేపడుతూ పోలీసులను ఆశ్రయించారు. తమ సమస్యను పరిష్కరించాలని పోలీసులను వేడుకున్నారు. అయితే విద్యార్థుల ఆందోళనపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌ నుంచి ఊర్లకు వెళ్లేందుకు విద్యార్థులకు అనుమతి ఇచ్చారు. సొంత వాహనాలు ఉంటేనే అనుమతి ఇస్తామని డీజీపీ తెలిపారు. అత్యవసరమైతే స్థానిక పోలీసులు అనుమతి ఇస్తారని చెప్పారు. ఉద్యోగులకు కంపెనీలే వాహనాలు ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించారు.

ఎలాంటి ఆటంకం లేకుండా స్వగ్రామలకు వెళ్లేలా పోలీసులు పాసులు మంజూరు చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చెక్‌పోస్ట్‌ల వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా విద్యార్థులు తమ తమ స్వస్థలాలకు వెళ్లేలా పాసులు మంజూరు చేశామని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు.

కానీ తెలంగాణా, ఏపీ ప్రభుత్వాలు జోక్యం చేసుకుని హాస్టళ్లను ఖాళీ చేయాల్సిన అవసరం లేదని చివరికి తేల్చాయి. ఎవరైనా హాస్టళ్లను ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.