తెలంగాణలో మద్యం అమ్మకాలపై ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్ లోని నాంపల్లిలోన్న ఆబ్కారి భవనాన్ని తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా సందర్శించారు.

కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత 40 రోజులకు పైగా మద్యం విక్రయాలు పూర్తిగా నిలుపుదల చేసిన అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాలతో నేటి నుండి అన్ని మద్యం దుకాణాలలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వటం జరిగింది.రాష్ట్రంలో మద్యం దుకాణాల పూర్తి వివరాలు, మద్యం కొనుగోలు దారులు పాటిస్తున్న నిబంధనలైన స్వీయ నియంత్రణ, భౌతిక దూరంతో పాటు విధిగా ముఖానికి మాస్కులు ధరించటంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆబ్కారి శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అజయ్ రావు, హరికిషన్, ఖురేషీ, సంతోష్ రెడ్డి, దత్తరాజ్ గౌడ్, శీలం శ్రీనివాస్ రావులతో సమావేశమయ్యారు.

ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా గుడుంబా తయారీ, అమ్మకాలను పూర్తి స్థాయిలో నిర్మూలించారు. కానీ గత 40 రోజుల నుండి రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నిలుపుదల చేయడంతో గుడుంబా తయారీదారులు గుడుంబా అక్రమంగా అమ్మకాలు జరగకుండా ఉక్కుపాదంతో అణిచివేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.

గుడుంబా నిర్మూలనలో భాగంగా తయారీ దారులను , అమ్మకాలు చేస్తున్న వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి లక్ష రూపాయల జరిమానా, PD యాక్ట్ కేసులను నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు.