దేశంలో వేసవి వడగాలులు జాగ్రత్త

కోవిడ్19 మహామ్మారి విస్తరిస్తున్న తరుణంలో వేసవి తీవ్రతతో వీచే వడగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ అడ్వైజరీ జారీ చేసింది.

వడగాలుల తీవ్రత వల్ల మరింత మంది జనం మృత్యువాత పడే అవకాశాలున్నాయని హెచ్చరించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. కరోనా పేషేంట్లతో ఇప్పటికే రద్దీగా ఉన్న ఆసుపత్రులు వడగాలుల బారినపడి అనారోగ్యం పాలైన వాళ్ళతో మరింత కిక్కిరిసిపోయే అవకాశాలు ఉంటాయన్న ఎంహెచ్ఏ.తగిన ఏర్పాట్లు చేయాలని సూచనలు చేేశారు.