జయహో జనతా కర్ఫ్యూ

జయహో జనతా కర్ఫ్యూ

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన ఆదివారం ‘జనతా కర్ఫ్యూను’ ప్రజలందరూ పాటించాలని తెలంగాణ/ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరారు. ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండేలా జనమంతా విధిగా స్వచ్ఛందంగా స్వర్గసీమలాంటి గృహానికి పరిమితమై విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరి పౌరులపై ఉందన్నారు.

జనతా కర్ఫ్యూ కార్యక్రమంతో ఎదురయ్యే సవాళ్ల కోసం పకడ్బందీ ఏర్పాట్లు, కార్యచరణ అంశాలపై ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వ విభాగాలన్నింటితో ఉన్నతస్థాయి సమావేశం కేజ్డా నిర్వహించి చర్యలు చేబడుతున్నారు.

శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా కట్టడిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు కలిసి చేయాల్సిన కార్యాచరణపై చర్చలు జరిపారు.