APలో ఆదివారం మాంసం బంద్?? లేదంటే???

ఆదివారం రోజున ఏపీలో ముఖ్యంగా విజయవాడలో షాపులు బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విజయవాడ, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, తిరుపతితో పాటు ముఖ్య నగరాల్లో రెడ్ జోన్లు నమోదు కావడంతో వైరస్ మహామ్మారి ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఆదివారం చికెను, చేపలు, మటను దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ప్రతి ఆదివారం ముఖ్యమైన నగరాల్లో చేపలు, చికెన్ మరియు మటన్ దుకాణాలు తెరవకూడదని పోలీసులు తెలియజేసారు. నిబంధనలు అతిక్రమిస్తే సీజ్ చేసి, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయబడునని హెచ్చరించారు.