లాక్ డౌన్2లో e-కామర్స్ డెలివరీ??

దిగ్బంధంలో నిత్యావసరాల సరఫరాకు మాత్రమే అనుమతి ఇతర వస్తువుల విషయంలో ఈ-కామర్స్‌ సంస్థలపై నిషేధం.

కోవిడ్‌-19 నేపథ్యంలో విధించిన జాతీయ దిగ్బంధం నుంచి కొన్ని కార్యకలాపాలకు మినహాయింపునిస్తూ సవరించిన ఏకీకృత మార్గదర్శకాలతో దేశీయాంగ శాఖ ఇవాళ అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాలకు ఒక ఉత్తర్వు ఇచ్చింది. ఈ మేరకు నిత్యావసరాలు సరఫరాచేసే ఈ-కామర్స్‌ సంస్థలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. తదనుగుణంగా ఆ సంస్థల వాహనాలకు అవసరమైన అనుమతులిస్తారు. నిత్యావసరాలు కాని వస్తువుల సరఫరాను ఈ సవరణ ద్వారా నిషేధించి, నవీకరించిన ఏకీకృత మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ తిరిగి జారీచేసింది.