సిబిఐ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరణ

సిబిఐ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరణ

పశ్చిమ బెంగాల్ సీఎం ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే. ఆమె తనపై దాడి జరిగిందని చెబుతుండగా, విపక్షాలు మాత్రం ఆమె వాదనలను ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ గాయపడిన ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ముగ్గురు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆమె కాలికి గాయం అయితే కాలును ఎలా స్వేచ్ఛగా కదిలించగలుగుతున్నారని వాదించారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పష్టత ఇవ్వాలని కోరారు. అయితే వారు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం ధర్మాసనం నేడు తిరస్కరించింది. మమత గాయంపై సీబీఐ దర్యాప్తుకు నిరాకరించింది. ఈ అంశంపై కలకత్తా హైకోర్టుకు వెళ్లాలంటూ పిటిషనర్లకు సూచించింది.