సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలపై సుప్రీం కోర్టులో విచారణ

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలను జూలై 31వ తేదీలోగా సుప్రీంకోర్టు చెప్పినా సీబీఎస్ బోర్డ్ ఇవ్వనుంది.

ఈ విషయంన్నీ కోర్టుకి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. ఏ ప్రాతిపదికన విద్యార్థులకు మార్కులు వేస్తారన్న అంశంపై ఇవాళ సుప్రీంకోర్టుకు కేంద్రం తన డేటాను సమర్పించింది. 11వ తరగతి, పదవ తరగతి మార్కుల ఆధారంగా 12వ తరగతి విద్యార్థులకు మార్కులు కేటాయిస్తామని కోర్టుకి సీబీఎస్ఈ బోర్డు తెలిపింది.

12వ తరగతి ప్రీ బోర్డు పరీక్షల ఆధారంగా 40 శాతం మార్క్‌లను కలపనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.

జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్‌, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది.

11వ తరగతి పర్ఫార్మెన్స్ ఆధారంగా 30 శాతం మార్క్‌లు, పదవ తరగతి ఆధారంగా 30 మార్క్‌లు ఇవ్వనున్నట్లు కోర్టుకి బోర్డు తెలిపింది.

మార్క్‌లతో సంతృప్తి చెందనివారు సీబీఎస్ఈ పరీక్షలను రాసుకోవచ్చు అని కోర్టుకి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు.