MP అసెంబ్లీలో శుక్రవారం బల నిరూపణ: సుప్రీంకోర్టు

MP అసెంబ్లీలో శుక్రవారం బల నిరూపణ: సుప్రీంకోర్టు

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం సాయంత్రం5 గంటలలోపు
కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ బల నిరూపణను నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఐతే అత్యున్నత ధర్మాసనం ఆదేశాలు వచ్చే వరకు కూడా
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అసెంబ్లీలో
బల నిరూపణకు వెళ్లడం లేదని మీడియాతో అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందా? అసలు ఉన్నట్టా లేనట్టా అనేది గవర్నర్ నిర్ణయిస్తారా? స్పీకరా? కోర్టులా? ఎవరు
తెలుస్తారో తెలియక గందరగోళం నెలకొని ఉండింది.

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 మంది MLAలున్నారు.
అందులో కాంగ్రెస్ 114, BSP2, SP1, BJP 109, ఇతరులు నలుగురు MLAలున్నారు. ప్రభుత్వం నిలబడేందుకు మ్యాజిక్ ఫిగర్ 115 మంది MLAల మద్దతు అవసరం కానీ
కాంగ్రెస్ నుంచి కమలం పార్టీలోకి వెళ్లిన జ్యోతిరాదిత్య సిందియాకు వెళ్లడంతో ఆయనకు మద్దతుగా 16 మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే కాంగ్రెస్ బలం 98 మాత్రమే.
కమల నాథ్ మాత్రం ఫ్లోర్ టెస్ట్ కు ఒప్పుకోవడం లేదు కానీ ఇప్పుడు బల నిరూపణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. .
కాంగ్రెస్ సర్కారు ఉంటుందా లేక కమలం పార్టీ మరోసారి ప్రభుత్వ పగ్గాలు చేపట్టనుందా రేపటితో తేలిపోనుంది.

గత వారం రోజులుగా జరిగిన పరిణామాలు పరిశీలిస్తే మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలపై శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, స్పీకర్, కాంగ్రెస్‌ పార్టీ వేరువేరుగా వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, హేమంత్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు?
మధ్యప్రదేశ్‌ స్పీకర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. మరోవైపు స్పీకర్ కరోనా కారణంగా మార్చి26 వరకు అసెంబ్లీని వాయిదా వేశారు. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో
ఈ రాజకీయ డ్రామాకు తెరపడనుంది.