కరోనా ఉచిత పరీక్షలు ఎవరెవరికి??

అత్యున్నత ధర్మాసనం దేశంలో కరోనా వైరస్‌ పరీక్షలు పేదలకు మాత్రమే ఉచితంగా చేయాలని నిర్ణయించింది. అలాగే ఉచిత పరీక్షలు ఎవరికి నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వమే నిర్ణయించాలని సూచించింది. ప్రైవేట్‌ లాబొరేటరీస్‌ ఉచితంగా పరీక్షలు చేయలేమని తెలపడంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి అర్హులైన వారికి, ప్రభుత్వం గుర్తించిన ఆర్థిక బలహీన వర్గాలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులో ఉన్న నిర్ణయాలు.