ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ ను విచారించిన సుప్రీంకోర్టు

ప్రభుత్వం జారీచేసిన జీవో నెంబర్ 176 పై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు.

నాలుగు వారాల్లోగా దాఖలైన పిటిషన్ విచారణ పూర్తిచేయాలని హైకోర్టు ని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం.

రిజర్వేషన్లు 50శాతం మించకూడదనే సుప్రీంకోర్టు నిబంధనను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని పిటిషన్లో పేర్కొన్న పిటిషన్ దారు బిర్రు ప్రతాప్ రెడ్డి.

రిజర్వేషన్లు 50శాతం దాటినా ఏపీ హైకోర్ట్ స్టే ఇవ్వకపోవడంతో సుప్రీం కోర్టులో పిటిషన్.

2010లో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే ఎన్నికలు జరగాలి.

ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ప్రత్యేక పరిస్థితులు లేవు కాబట్టి తీర్పుకు అనుగుణంగానే రిజర్వేషన్లు ఉండాలని స్పష్టం చేసిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.

షెడ్యూల్ ప్రాంతాలను మాత్రమే ప్రత్యేక పరిధిగా పరిగణనలోకి తీసుకోవాలి.