ఆరెంజ్ జోన్లలో వ్యక్తులు మరియు వాహనాల కదలికలపై నిఘా

మే 4, 2020 నుండి అమలులోకి వచ్చే రెండు వారాల లాక్‌డౌన్ సమయంలో ఆరెంజ్ జోన్లలో వ్యక్తులు మరియు వాహనాల కదలికకు సంబంధించి మ‌రింత స్పష్టత

దేశంలో కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ్యాప్తి ప‌రిస్థితుల‌ను స‌మ‌గ్రంగా స‌మీక్షించిన త‌రువాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) లాక్‌డౌన్‌ను మే4వ తేదీ నుంచి మ‌రో రెండు వారాల పాటు పొడిగిస్తూ శుక్ర‌వారం ఉత్తర్వు జారీ చేసింది. ఆరెంజ్ జోన్‌లోని వ్యక్తులు మరియు వాహనాల కదలికకు సంబంధించిన గందరగోళాన్ని తొలగించడానికి (ఆరెంజ్ జోన్లలో అనుమతించిన‌ కార్యకలాపాలపై సంబంధిత పేరాను చూడండి) ఈ క్రింద పేర్కొన్న స్పష్టీకరణలు ఇవ్వబడ్డాయి.

– దేశవ్యాప్తంగా నిషేధించబడిన కార్యకలాపాలతో పాటు ఆరెంజ్ జోన్లలో ఇంటర్-డిస్ట్రిక్ట్ మరియు ఇంట్రా-డిస్ట్రిక్ట్ బస్సులు నడపడం నిషేధించబడింది.
– పరిమితులతో మరో రెండు కార్యకలాపాలు అనుమతించబడ్డాయి
– టాక్సీలు మరియు క్యాబ్ అగ్రిగేటర్లకు అనుమతి ఉంది, ఒక డ్రైవర్ మరియు ఇద్దరు ప్రయాణీకుల‌కు మాత్రమే ప్ర‌యాణానికి అనుమ‌తిస్తారు.
– వ్యక్తులు మరియు వాహనాల అంతర్-జిల్లా కదలిక అనుమతించబడుతుంది, అనుమతి పొందిన కార్యకలాపాలకు మాత్రమే నాలుగు చ్ర‌కాల వాహ‌నంలో గరిష్టంగా ఇద్దరు ప్రయాణీకులను డ్రైవ‌ర్‌తో పాటు మాత్ర‌మే అనుమ‌తిస్తారు.
– ఆరెంజ్ జోన్లలో అన్ని ర‌కాల ఇతర కార్యకలాపాలు ఎటువంటి పరిమితులు లేకుండానే అనుమతించబడతాయి.
– రాష్ట్రాలు / ‌కేంద్ర పాలిత ప్రాంతాల వారు త‌మ‌త‌మ‌ అంచనా మరియు ప్రాధాన్యతల ఆధారంగా ప‌రిమిత సంఖ్యలో ఏవైనా కార్యకలాపాలను అనుమతించడానికి వీలు క‌ల్పించారు.