సూయ సూయ అనసూయ….

బుల్లితెర యాంకర్లుగా కెరీర్ ప్రారంభించి వెండితెరపై హీరోయిన్ పాత్రాల్లో జబర్దస్త్ యాంకర్ అనసూయ దూసుకెళ్తోంది.

ఓవైపు జబర్దస్త్ షో, మరోవైవు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటనతో రెండు చేతుల సంపాదిస్తూ లక్షల ప్రేక్షకుల అభిమానుల్ని ఈ సుందరి మూట కట్టేసుకుంది. నాలుగు పదుల వయస్సులో సోషల్ మీడియాలో అనసూయ ఏం చేసినా వివాదాలు అవుతున్నాయి.

కరోనా కాలంలో నెటిజన్లతో ముచ్చటిస్తూ ప్రశాంతంగా ముచ్చటించింది. అనసూయ అభిమానుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆసక్తికరంగా వ్యక్తిగత వివరాలు బయపెట్టింది. పర్యటకురాలిగా బీచులు, కొండలు కొనల్లో విహరించడం ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. మన దేశంలో లాక్ డౌన్ పూర్తయ్యాక ఫస్ట్ ఏం చేస్తారంటే టక్కున సెలూన్ వెళ్తానన్నది. ‘సిడ్నీ షెల్డన్ రాసిన ఇఫ్ టుమారో కంస్’ చదివితే ఏడుపొచ్చిందని ట్వీట్ చేసింది. నాకు నేనే స్పెషల్, పెళ్లయితే మహిళల జీవితం మంటకరిచినట్టు కాదని, పెళ్లి తర్వాత అయినా కలలు కనాలి సాధించాలని, మనమేమి బానిసలు కాదని కోపంగా కొరుక్కుంది. అనసూయన మజాకా ఎప్పుడేమి చేస్తుందో ఎలా ఉంటుందో ఆమెకు మాత్రమే సొంతమని నిరూపిస్తోంది.