ప్రపంచ కప్ T20పై ICC ప్రకటన

క్రికెట్ ప్రేమికులకు అసంతృప్తి కలిగించే నిర్ణయం. క్రికెట్ T20 ప్రపంచ కప్‌ నిర్వహణపై కరోనా సమయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటించమని ICC తేల్చింది.

2020 ఆగస్టు తర్వాతే T20 టోర్నీ అంశంపై చర్చిస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించింది. విశ్వ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఒలింపిక్స్ కూడా వాయిదా పడ్డాయి. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కోంటోన్న అత్యవసర సమయంలో ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యమని టీ20 ప్రపంచకప్ వాయిదాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఐసీసీ తేల్చింది.