కరోనా కారణంగా తాజ్ మహాల్ సందర్శన నిలిపివేత
దేశంలో కరోనా కారణంగా కేంద్రం పర్యాటక ప్రాంతాల
సందర్శనను కూడా మూసివేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక పర్యాటకులు సందర్శించే తాజ్ మహల్ చూసేందుకు పర్యాటకులకు అనుమతి నిరాకరిస్తూ తాత్కాలికంగా నిలిపివేసింది. మంగళవారం రాత్రి 9 గంటల వరకు
137 కరోనా కేసులు నమోడవడంతో ఈ మహమ్మారి
ప్రజల్లో ప్రబలకుండా ఉండేందుకు మంగళవారం నుంచి
తాజ్ మహల్ సందర్శనను నిలిపివేస్తున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ప్రకటించింది.