హైద్రాబాద్ తల్వార్ టీమ్ “కరోనా అవగాహన గీతం’

“పది కాలాలు పచ్చగా ఉండాలంటే.. ఈ పక్షం రోజులు ప్రశాంతంగా ఇంటి పట్టునుండండి” అంటూ..
హైదరాబాద్ తల్వార్ టీమ్..
కరోనా అవగాహన గీతం రూపొందించింది.
హైద్రాబాద్ టీమ్ మెంబర్స్ లోహిత్ కుమార్, అభినవ్ సర్దార్, శ్రీధర్ రావు, చీదం శ్రీనివాస్, రాజారెడ్డి ఇందుర్తి, నిధి ఈ ప్రత్యేక గీతంలో నటించారు. ఈ గీత నిర్మాతలు కూడా వారే కావడం విశేషం. ప్రఖ్యాత దర్శకుడు-కొరియోగ్రాఫర్ లారెన్స్ ప్రియ శిష్యుడు మల్లన్న శ్యామ్ నృత్య దర్శకత్వం వహించిన ఈ గీతం మురళి మధు రచన-గానంలో జీవం పోసుకుంది. కాయితం ఇంద్రసేనారెడ్డి సహకారం అందించారు.
ఈ గీత రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించిన ప్రముఖ నటుడు లోహిత్ మాట్లాడుతూ..
ప్రపంచవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనాను మనలో చాలామంది చాలా లైట్ గా తీసుకుంటున్నారు. అందుకే.. మా హైద్రాబాద్ తల్వార్ టీమ్ తరపున పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే.. ఈ అవగాహనా గీతాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తున్నాం. ఒక మంచి టీమ్ స్పిరిట్ తో తెరకెక్కించిన గీతమిది’ అన్నారు!!