తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపియుఎస్ ) విజ్ఞప్తి

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపియుఎస్ ) ప్రతినిధి బృందం గౌరవ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలో తెలంగాణ గవర్నర్ తమిళశై సౌందర్య రాజన్ ను కలిసి ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని అందుకు ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. పిఆర్సినీ 63% ఫిట్మెంట్ వెంటనే ప్రకటింప చేయాలని, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ పరిష్కరించి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించాలని, పండిట్ పిఇటి పదోన్నతుల కోసం ఇచ్చిన జీవోల వల్ల ఉపయోగం లేదని, దీర్ఘకాలికంగా పరిష్కారంకు నోచుకోని ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపాలని సంఘము పక్షాన గవర్నరుకు విన్నవించడమైనది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు ఆధ్వర్యంలో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడంపై గద్వాల మండల అధ్యక్షులు G. నాగరాజు హర్షం వ్యక్తం చేశారు.