రేపే తెలంగాణలో 24 గంటలు జనతా కర్ఫ్యూ

24 గంటలు జనతా కర్ఫ్యూ: CM కేసీఆర్

తెలంగాణలో ఆదివారం 6గంటల నుంచి సోమవారం
6గంటల వరకు అంటే 24 గంటలు తెలంగాణాలో జనతా కర్ఫ్యూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారికి మాత్రమే కరోనా పాజిటివ్
ఫలితాలు వచ్చాయి. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుత్వానికి సహకరించి, సెల్ఫ్ రిపోర్టు చేయాలి. ప్రభుత్వమే చికిత్సతో పాటు అన్ని ఖర్చులు భరిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20 వేల మంది విదేశాల నుంచి వచ్చారు. అందులో
11వేల మందిని అదుపులోకి తీసుకున్నాము. రాష్ట్రంలో కరోనా కట్టడికి 5274 నిఘా బృందాలు పనిచేస్తున్నాయి.

నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం జాగ్రత్త, ఫోటోలతో పూర్తి సమాచారం

63000 మంది పోలీసు సిబ్బంది 24/7 పర్యవేక్షిణ చేస్తూనే ఉన్నారు. గృహాల్లోనే పిల్లలు, వృద్ధులు రెండు వారాలపాటు
ఉండాలి బయటకు రాకూడదు. ఆదివారం తెలంగాణ రాష్ట్రములోని 54 సరిహద్దులు, బస్సులు నిలిపివేస్తున్నాము.
ప్రధాని చెప్పింది రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మాత్రమే కానీ మన తెలంగాణలో 24గంటలు కర్ఫ్యూ పాటించి దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచేలా ప్రజాలంతా సహకరించాలి. సిసిఎంబిలో ల్యాబ్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని కోరగా సానుకూలంగా స్పందించారన్నారు. తెలంగాణలో ఆదివారం మెట్రో, రైళ్లు, RTC బస్సులు, దుకాణాలు బంద్ చేస్తున్నాము. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలి. ఎక్కడ బ్లాకులో సరుకులు అమ్మరాదు. అత్యవసర రవాణా కోసం 5రైళ్లు, డిపోకు 5బస్సులు అందుబాటులో ఉంటాయి.

ప్రపంచాన్ని వణికిస్తోన్న సూక్ష్మ జీవి కరోనా సక్సెస్

తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు ఎన్ని వేల
కోట్ల రూపాయలు అయినా ఖర్చు చేస్తాం వెనకాడే ప్రసక్తే లేదు. ప్రజలు ఆందోళన చెందవద్దు. తెలంగాణలో కరోనా తీవ్రతమైతే రాష్ట్రాన్ని పూర్తిగా షట్ డౌన్ చేసి ప్రభుత్వమే ప్రజలందరికీ నిత్యవసరాలు ఇంటికి సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. కరోనాకు స్వాభిమానం ఎక్కువ అందుకే అందరు గుర్తుంచుకోండి మనం ఆహ్వానిస్తేనే వస్తుంది జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యం తగదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
తెలంగాణలో ప్రజలందరూ బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విజ్ఞప్తి చేసారు.

కరోనా కట్టడికి గృహమే స్వర్గసీమ