తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు

  1. తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి మండలి ఆమోదం పొందిన గవర్నర్ ప్రసంగం ప్రతిని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కు అందించారు.

తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మార్చి 6న తెలంగాణ సమావేశాలు ప్రారంభం కానుండగా మార్చి 8న బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి.