తెలంగాణలో కరోనా తొలి మరణం, పాజిటివ్ కేసులు 65

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఇంతకింతకు పెరుగుతున్నాయి. కుత్బుల్లాపూర్ ఏరియా నుంచి ఒకటే కుటుంబం నుంచి నాలుగు కేసులు నమోదయ్యాయి. కరోనా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకే ఎక్కువ, ఇప్పటికి స్థానిక తెలంగాణ ప్రజలకు సోకలేదు. కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సమాచారం మాకు అందించాలి. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు.

ఇవ్వాళ కొత్తగా 6కేసులు వచ్చాయి. తెలంగాణలో తొలి కరోనా సోకిన వ్యక్తి మృతి చెందారు. 74ఏళ్ల వ్యక్తి సీరియస్ అవడంతో గ్లోబల్ హాస్పిటల్ లో చేరారు. ఆవ్యక్తి మరణించిన తర్వాత అతనికి కరోనా వచ్చిందని సమాచారం అందింది. ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికపుడు అందుబాటులో పెడుతామని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఐతే ఇప్పటికి ఏ హాస్పిటల్ లో ఎలాంటి సమస్య లేదు. దయచేసి కరోనాపై తప్పుడు ప్రచారం చేయకండి. గాంధీ హాస్పిటల్ వైద్యులకు అండగా ఉండాలి. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతగా ఉండాలి. సీఎం ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు 24 గంటలు డ్యూటీలో ఉంటున్నామని మంత్రి అన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఎక్కడ రెడ్ జోన్ లేదని, ప్రార్థన మందిరాల్లోకి ప్రజాలేవరూ వెళ్ళకండని విజ్ఞప్తి చేసారు.