తెలంగాణలో కరోనా కేసులు 36.

తెలంగాణలో కరోనా కేసులు 36.

మన దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ నమోదవుతోన్న
పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో
ఈరోజు మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తంగా తెలంగాణలో 36కు కరోనా
వైరస్ కేసుల సంఖ్య చేరుకుంది. కోకాపేటకు చెందిన 49 సంవత్సరాల ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇతను లండన్ నుండి వచ్చాడు. అలాగే చందానగర్ కు చెందిన
39 సంవత్సరాల మహిళ జర్మనీ నుండి వచ్చింది ఈమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. బేగంపేటకు చెందిన 61 సంవత్సరాల వృద్ధురాలు సౌదీ అరేబియా నుండి వచ్చిన ఈమెకు కరోనా పాజిటివ్ నమోదైంది.