కరోనా కట్టడిపై సమీక్షలు

కరోనా కట్టడిపై సమీక్షలు

తెలంగాణ వరంగల్ జిల్లాలో క‌రోనా వైర‌స్ నిర్మూల‌నపై అధికారుల‌తో రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
సమీక్ష నిర్వహించారు. క‌రోనా వైర‌స్ నిర్మూల‌న‌పై ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు, సూచ‌న‌లు, ప్ర‌జ‌లు ఆచ‌రిస్తున్న విధానాన్ని అధికారుల ప‌నితీరుని మంత్రి ఎర్ర‌బెల్లి పరిశీలించారు.
వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో నిర్వహించిన ఈ స‌మావేశానికి వ‌రంగ‌ల్ అర్బ‌న్, రూర‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్లు రాజీవ్ గాంధీ హ‌న్మంతు, హరిత‌, వరంగల్ మహనగర కార్పోరేషన్ కమిషనర్ పమేలా సత్పతీ, వైద్య‌శాఖ
అధికారులు హాజరయ్యారు.