తెలంగాణలో వేతనాల కొతపై ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెల నుంచే జీతాల కోత వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో విడుదల చేసింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం వేతనంపై

కోత విధించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలపగా, తుదపరి ఉత్తర్వులు వచ్చే వరకు కోత అమల్లో ఉంటుంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ష జరిగింది.

1. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్‌పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75%
2. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అఖిల భారత సర్వీసుల అధికారుల వేతనాల్లో 60%
3. మిగిలిన కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50%
4. నాలుగో తరగతి, కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగుల వేతనాల్లో 10%
5. విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో 50%
6. నాలుగో తరగతి విశ్రాంత ఉద్యోగుల పింఛనులో 10%
7. ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు సంస్థల ఉద్యోగులు, పింఛనుదారుల మాదిరిగానే వేతనాల్లో కోత ఉంటుంది.