రైతే రాజు భయం వద్దు: మంత్రి శ్రీనివాస్

రబీలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆన్నారు.

గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ లో జిల్లా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం సేకరణకు 37 వేల కోట్ల రూపాయలు సమకూరచిందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని, రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో 225 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, గ్రామ పంచాయతీల వారీగా దాన్యం కొనుగోలు కేంద్రాలు గుర్తించామని చెప్పారు.

గ్రామాలలో రైతుబంధు సభ్యులు, గ్రామ, మండల స్థాయి కమిటీలు పూర్తి స్థాయిలో పాల్గొని సహకారం అందించాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. అంతేకాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డైరెక్టర్లు, అధ్యక్షులు, సభ్యులు అందరూ సహకారం అందించాలని, ఒక పద్ధతి ప్రకారం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. వారి పంట కోసేందుకు జిల్లాలో 676 వారి కొత్త యంత్రాలు సిద్ధంగా ఉన్నాయని,కోతల సమయంలో కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ,కోతలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయాలని చెప్పారు.

వరి కోత యంత్రాలు మండల కేంద్రాలలో సిద్ధంగా ఉంచి ఎక్కడికి అవసరమైతే అక్కడికి పంపించే ఏర్పాటు చేసేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎక్కడ సమస్య రాకుండా చూడాలని, రైతులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైతే మొబైల్ దాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు .ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే జిల్లా రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కు లేదా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కలెక్టర్ కార్యాలయం, కలెక్టర్ నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయవచ్చు అని తెలిపారు.

దాన్యం కొనుగోలు కేంద్రాలు పై గ్రామాలలో టామ్ టామ్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలని, రైతు దగ్గర ఊర్లోనే దాన్యం కొనుగోలు చేస్తున్నామని, అంతేకాక కొన్న వెంటనే వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని, కాబట్టి ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పాలని ఆయన సూచించారు.

రైస్ మిల్లర్లు ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఏర్పాటు చేసుకోవాలని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల ను అన్ని రకాలుగా ఆదుకుంటుందని, రైతులకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మిల్లర్ల పై ఉందని మద్దతు ధరకు తక్కువ కాకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు. ధాన్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు ,ఇతరులకు తెలియజేసేందుకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ శాఖ అధికారులు అందరూ ఈ గ్రూపులో సభ్యులుగా చేర్చాలని ఆయన వ్యవసాయ శాఖ జెడికి సూచించారు.

కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ కరోనా పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు కూడా ధాన్యం అమ్మేటప్పుడు సామాజిక దూరం పాటించాలని సూచించారు.

రైతులందరికీ,యంత్రాల పై పని చేసే వారికికూడాశానిటైజర్ ,మాస్కులుఇవ్వాలని చెప్పారు. జిల్లాలో అన్ని శాఖలు తీసుకుంటున్న చర్యల వల్ల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, అయితే ఇద్దరికీ గతంలోనే కరోనా పాజిటివ్ పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ప్రజలందరూ అప్రమత్తం కావాలని సామాజిక దూరం పాటించాలని , ఇళ్లలోనే ఉండాలని కోరారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిత్యావసర సరుకులు, కూరగాయలు ఏర్పాటు చేయడం జరిగిందని, మూడు నెలల వరకు సరిపోయే నిల్వ ఉందని తెలిపారు. ప్రజలు ఎవరూ కూడా బయటికి రావద్దని మంత్రి కోరారు .కరోనా పై ఎవరైనా తప్పు పోస్టింగ్, సమాచారం పెడితే కేసు నమోదు చేయడమే కాకుండా జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. ఢిల్లీ నుండి వచ్చిన వారికి వారు కలిసిన వారిని కూడా జిల్లా యంత్రాంగం జాగ్రత్తగా గమనించి వారందరిని ఇంట్లో ఉండేలా ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.

మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రపంచానికి ముప్పు ఏర్పడిందిని, జిల్లాలో కరోనా నివారణకు ఆయా శాఖలు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు .రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వరి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం కొనుగోలు ఏర్పాటు చేస్తుందని, రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.

జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనలు, సలహాలను అధికారులు పాటించి రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు.దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ మండల స్థాయి ప్రజాప్రతినిధులు స్థానిక తాసిల్దార్తో సమన్వయం చేసుకొని పని చేయాలని, గతంలో మార్కెట్ కి వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేసే వాళ్ళని ప్రస్తుతం గ్రామ పంచాయతీకి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అందువల్ల రైతులు ఆందోళన చెందకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్ముకోవాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని అధిగమించి ముందుకు వెళ్తామని ఆయన విజ్ఞప్తి చేశారు.కరోనాను కట్టడి చేయడంలో ప్రతి ఒక్కరు సహకరించాలని,దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు ప్రకారం కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని తెలిపారు. ఎస్పీ రేమారాజేశ్వరి మార్కెటింగ్ అధికారులు తదితరులు మాట్లాడారు.

ఈ సమావేశంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు నిజాం భాషఅదనపు కలెక్టర్ సీతారామారావు,అదనపు ఎస్ పి వెంకటేశ్వర్లు, పిఎసిఎస్ అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.