తెలంగాణా ఫెలోషిప్ ప్రోగ్రాం

తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో తొలిసారిగా తెలంగాణ ఫెలోషిప్ ప్రోగ్రాంను ప్రకటించింది. స్కూల్స్, కాలేజ్, యూనివర్శిటీలు గ్రామీణ ప్రాంతాలు, జిల్లాల పరిధిలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ను పెంచి సమాజానికి ఏదైనా చేయాలన్న ఉద్దేశం ఉన్న వాళ్లకు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఆర్ట్స్, కామర్స్, సైన్స్, లా, ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్లలో డిగ్రీ పూర్తి చేసినవాళ్లు, ఏదైనా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఇతర వృత్తులలో ఉన్నవాళ్ళు ఫెలోషిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏరంగంలోనైనా ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. రెండు రకాల ఫెలోషిప్ లలో ఫుల్ టైం కోసం ఎంపికైన వాళ్లకు స్టైఫండ్ ఇస్తారు. కాగా, పార్ట్ టైం ఫెల్లోషిప్ లో మాత్రం అభ్యర్థులు వాలంటరీ గా చేసుకోవాల్సి ఉంటుంది. ఫెలోషిప్ కోసం ఎంపికైన వాళ్లకు ఓ ఏడాది పాటు ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం దొరుకుతుంది.

దరఖాస్తు చివరి తేదీ: మే – 10.
ఫలితాలు: మే 4 వ వారం
ఫెలోషిప్ ప్రారంభం: జూన్

పూర్తి వివరాల కోసం www.teamtsic.telangana.gov.in ను సంప్రదించండి.