తెలంగాణలో ఫ్రూట్స్ డెలివరీకి జనం ఎగబడుతున్నారు..

తెలంగాణ మార్కెటింగ్‌ శాఖ అలాగే వాక్‌ ఫర్ వాటర్‌, సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటికే పండ్ల కార్యక్రమానికి జనాదరణ పెరుగుతోంది. ఫోనుకాల్స్‌, ఆన్‌లైన్‌లో ఆర్డర్లు 88753 51555 నెంబరుకు పోటెత్తుతున్నాయి.

నాణ్యత బాగుండడం, తక్కువ ధర కావడంతో పండ్లు కావాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. సంబంధిత వెబ్‌సైట్‌కి ఇప్పటికి 26లక్షల హిట్స్‌ వచ్చాయని, ఇప్పటి వరకు వచ్చిన లక్షన్నర ఆర్డర్లలో… 65వేలు సరఫరా చేశామన్నారు. డెలివరీ వేగవంతం చేసేందుకు తపాలశాఖతో ఒప్పందం కుదుర్చు కున్నారు.

లాక్‌డౌన్‌ వేళ దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రజల ఇళ్ల వద్దకే తాజా పండ్లు సరఫరా చేస్తున్నందున ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌ రెడ్డిలను నగరవాసులు ప్రశంసిస్తున్నారు. ఇటు రైతులు అటు వినియోగదారులకి ఏకకాలంలో మంచి చేస్తున్నారంటూ కొనియాడుతున్నారు.

అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ప్రజలు ఫోన్లు చేసి తమకి కూడా పండ్లు కావాలని కోరుతున్నట్లు వెల్లడించారు. సర్కార్‌ పిలుపు మేరకు కొందరు దాతలు స్పందించి పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, అనాధలకి పండ్లు వితరణ చేస్తున్నారని చెప్పారు. కరోనాతో దేశంలోని ప్రధాన రంగాలు స్తంభించిన సమయంలో రైతులని ఆదుకునే సంకల్పంతో చేపట్టిన ప్రయోగానికి జనామోదం లభించడం సంతోషంగా ఉందన్నారు.

For more information on this subject:
Karunakar Reddy
Founder and convenor
www.walkforwater.in