తెలంగాణ కరోనా వాట్సాప్

కోవిడ్-19పై సమాచారాన్ని అందించే వాట్సాప్ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం 9000 658 658 నెంబరుపై “TS Gov Covid Info” పేరిట ఓ వాట్సాప్ చాట్ బాట్ అధికారిక సమాచారం కోసం అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్-19పై సమాచారం, నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పౌరులకు తెలియజేసేందుకు ఈ వాట్సాప్ వేదికను ఉపయోగించుకోనుంది.

కరోనా వైరస్ పై పోరుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం వాట్సాప్ సౌజన్యంతో ఈ నిర్దిష్టమైన చాట్ బాట్ రూపొందించింది. లాక్ డౌన్ ను గౌరవిస్తూ ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండాలి. అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన సమాచారంపైనే ఆధారపడాలి. చాట్ బాట్ ను ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆరంభించారు.

చాట్ బాట్ సంభాషణ ప్రారంభించడానికి +91-9000658658 నంబరుకి ‘Hi’ లేదా ‘Hello’ లేదా ‘Covid’ అని వాట్సాప్లో సందేశం పంపించాలి.

https://wa.me/919000658658?text=Hi లింకును తమ మొబైల్ నుండి క్లిక్ చేయాలి.

సూచనలు covid19info-itc@telangana.gov.in కి ఈమెయిల్ చేయవచ్చు.